సుహానాకి ప్ర‌శంస‌ల వ‌ర్షం

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. సుహానా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయింది. ప్ర‌ముఖుల ముఖ చిత్రాల‌ను అచ్చువేసే ప్ర‌ముఖ ప‌త్రిక వోగ్ ప‌త్రిక ముఖ చిత్రంగా సుహానా ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డ‌మే ఇందుకు కార‌ణం.

వోగ్ ప‌త్రిక ముఖ చిత్రం చూసిన త‌రువాత చాలామంది బాలీవుడ్ ప్ర‌ముఖులు సుహానాను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు.  షారూఖ్ కు ఆప్త మిత్రుడైన ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహ‌ర్ సుహానాను స్వాగ‌తిస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు. వోగ్ ముఖ‌చిత్రం ఎంతో అందంగా ఉంద‌ని, ఆమెకు ఉన్న ప్ర‌తిభ‌కు ఇప్ప‌టికైనా స్పాట్ లైట్ లోకి వ‌చ్చినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఇక‌పై త‌న‌ను అంకుల్ అని పిల‌వ‌వ‌ద్దంటూ స్వీట్ వార్నింగ్ కూడా జారీ చేశాడు క‌ర‌ణ్.

షారూఖ్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లోని త‌న ఖాతాలో త‌న కూతురు క‌వ‌ర్ ఫొటోతో ఉన్న వోగ్ మ్యాగ‌జైన్ ఫొటోను షేర్ చేశారు. అంతే కాదు ఆ మ్యాగ‌జైన్ ను ఆయ‌నే ఆవిష్క‌రించ‌డం మ‌రో విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here