మిస్టీరియ‌స్ డెత్‌! 15 ఏళ్ల బాలుడు హ‌ఠాన్మ‌ర‌ణం! కార‌ణం-ఆశ్చ‌ర్యప‌రుస్తోంది!

ముంబై: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న బాలుడి పేరు రిత్విక్ ఘాడ్షి. వ‌య‌స్సు 15 సంవ‌త్స‌రాల‌కు అటు ఇటుగా ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. మ‌హారాష్ట్రలో ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌లు మొద‌లు కావ‌డానికి స‌రిగ్గా 12 గంట‌ల ముందు మ‌ర‌ణించాడు. కార‌ణం.. వినే వారిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

నిండా 15 సంవ‌త్స‌రాలు కూడా లేని రిత్విక్ గుండెపోటుతో మ‌ర‌ణించాడ‌ని చెబుతున్నారు. దీన్ని ఇంకా డాక్ట‌ర్లు నిర్దారించాల్సి ఉంది. ముంబై వ‌ర్లీ ప్రాంతంలోని ఆద‌ర్శ‌న‌గ‌ర్‌లో త‌న త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రిత్విక్ నివ‌సిస్తుండేవాడు. దాద‌ర్‌లోని శిశువిహార్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. రాత్రి 11:30 గంట‌ల స‌మయంలో నిద్ర‌పోయాడు.

అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత 1:15 నిమిషాల‌కు గ‌ట్టిగా అరుస్తూ నిద్ర‌లేచాడు. త‌ల్లిదండ్రులు మేల్కొని ఆరా తీసేలోప‌లే కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే రిత్విక్‌ను కింగ్ ఎడ్వ‌ర్డ్ మెమోరియ‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు డాక్టర్లు తెలిపారు. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం త‌ర‌లించారు.

అంత‌కంటే ప్ర‌త్యేకించి- రిత్విక్ కాలేయం టిష్యూల‌ను ప్ర‌త్యేకంగా సేక‌రించి, క‌లినా ఫోరెన్సిక్ ల్యాబొరేట‌రీకి పంపించారు. రెండువారాల కింద‌టే కామెర్లు సోక‌గా దానికి ప్ర‌త్యేకంగా వైద్యం చేయించుకున్నాడ‌ని, అది పూర్తిగా న‌య‌మైంద‌ని త‌ల్లిదండ్రులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here