మంత్రిగారి సెప్పులండీ! ఆ మాత్రం కాప‌లా ఉండొద్దేటి?

ఈ ఫొటోలో ఓ యువ‌కుడు ఉన్న చోటి నుంచి క‌ద‌ల‌కుండా, విగ్ర‌హంలో నిల్చుని పోయాడు. సుమారు గంట‌న్న‌ర పాటు ఆ ప్ర‌దేశం నుంచి క‌ద‌ల్లేదు. ఎలా ఉన్నోడు, అలానే ఉండిపోయాడు. కార‌ణం- చెప్పులు. అత‌ని కాళ్ల కింద న‌ల్ల‌గా నిగనిగ‌లాడుతూ క‌నిపిస్తున్నాయే.. ఆ చెప్పుల కోసం ఆ యువ‌కుడు గంట‌న్న‌ర‌పాటు క‌ద‌ల్లేదు, మెద‌ల్లేదు. ఆ చెప్పులు మంత్రిగారివి. అల్లాట‌ప్పా పోర్ట్‌ఫోలియో అనుకుంటున్నారేమో.

హోమ్ మినిస్ట‌రండీ! మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోమ్ మంత్రి భూపేంద్ర‌సింగ్ చెప్పులు అవి. ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌ర ఆల‌యానికి వ‌చ్చిన ఆయ‌న చెప్పుల‌ను బ‌య‌ట వ‌దిలి, త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఒక‌రిని దానికి కాప‌లాగా ఉంచి లోనికి వెళ్లారు. సుమారు గంట‌-గంట‌న్న‌ర త‌రువాత బ‌య‌టికి వ‌చ్చారు. అప్ప‌టిదాకా- ఆ ఉద్యోగి.. అక్క‌డే నిల్చున్నారు. క‌ద‌ల‌ను కూడా క‌ద‌ల్లేదు. మంత్రిగారొచ్చిన త‌రువాత ఆయ‌న‌తో పాటు వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here