6138కోట్ల రూపాయలు.. ఒక్కో మ్యాచ్ కు 60కోట్ల పైమాటే..!

ఇప్పటికే ఐపీఎల్ రైట్స్ ను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్.. 2018 నుండి 2023 వరకూ భారత్ ఆడబోయే మ్యాచ్ లను ప్రసారం చేయడానికి ఏకంగా 6138.1 కోట్ల రూపాయలను చెల్లించబోతోంది స్టార్ ఇండియా గ్రూప్..! ఒక్కో మ్యాచ్ కు బీసీసీఐ దాదాపు 60కోట్ల రూపాయలకు పైగా చెల్లించనుంది. సోనీ, రిలయన్స్ జియోల నుండి పోటీ ఎదురైనా స్టార్ ఇండియా బీసీసీఐ మీడియా హక్కులను కొనుగోలు చేసింది. ఈ-బిడ్ ద్వారా ఈసారి మీడియా హక్కులను విక్రయించారు.


ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి 2023 మార్చి 31 వరకు స్టార్ ఇండియా టీమిండియా ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. ఈ ఐదేళ్ల కాలంలో భారత్ అన్ని ఫార్మాట్లు కలుపుకొని 102 మ్యాచ్‌లు ఆడనుంది. గత ఏడాది సెప్టెంబర్లో ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2018-22 మధ్య కాలానికి స్టార్ ఇండియా ఏకంగా రూ.16,347.5 కోట్ల బిడ్ దాఖలు చేసింది. 2012-18 మధ్య కాలానికి భారత మ్యాచ్‌ల ప్రసారానికి స్టార్ ఇండియా రూ. 3851 కోట్లు చెల్లించింది. ఇప్పుడు అంతకు మించి బీడ్ దాఖలు చేశారు. ప్రస్తుతం భారత జట్టు భారత్ లో ఏ మ్యాచ్ ఆడినా కూడా స్టార్ నెట్ వర్క్ లోనే చూడాల్సి ఉంటుంది. అలాగే న్యూజిలాండ్ లో జరిగే మ్యాచ్ లను కూడా స్టార్ నెట్ వర్క్ ప్రసారం చేయనుంది. ఇక ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ లను మాత్రమే సోనీ నెట్ వర్క్ ప్రసారం చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here