ఎట్టకేలకు ఓ మంచి మాట చెప్పిన ఎస్బీఐ..!

గత కొద్ది నెలలుగా మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోంది ఎస్బీఐ. చాలా మంది గగ్గోలు పెడుతున్నా కూడా ఎస్బీఐ కనికరించలేదు. అలాంటి తరుణంలో కనీసం కొందరికైనా మంచి చేస్తూ ఎస్బీఐ ఓ ప్రకటన వెలువరించింది. వ‌డ్డీ రేట్లు త‌క్కువ అవుతున్నాయ‌ని నిరాశ చెందుతున్న ఎస్బీఐ ఖాతాదారుల‌కు శుభవార్త చెప్పింది. డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది.

తాజా మార్పుల‌తో 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగింది. వార్షిక వడ్డీ రేటు 6.40శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది 6.25శాతంగా ఉండేది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల‌ప‌రిమితి ఉండే డిపాజిట్లపై 6.50శాతం వడ్డీని అందించనుంది. సీనియర్ సిటిజ‌న్ల‌ డిపాజిట్లపై ఇక‌పై 7శాతం వడ్డీ అమ‌లు కానుంది. అంతకు ముందు ఇది 6.50 శాతంగా ఉంది. ఈ సవరించిన వడ్డీరేట్లు నూత‌నంగా చేసే డిపాజిట్లకు , రెన్యువ‌ల్‌ చేసుకునే డిపాజిట్లకు కూడా వర్తిస్తాయ‌ని ఎస్‌బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here