బ్యాంకు తాళాలు పగులగొట్టి లోపలి వెళ్ళిన దొంగ.. ఏమి చేసి వచ్చాడో తెలుసా..?

దొంగతనం చేయడం అంత వీజీ కాదు.. అన్నీ కలిసొస్తేనే డబ్బులు కూడా లభిస్తాయి. లేదంటే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఓ దొంగ ఎలాగోలా బ్యాంకు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్ళాడు. అయితే డబ్బులు దాచిన లాకర్ రూమ్ ను తెరవడానికి అతడు తెగ కష్టపడ్డాడు. దాదాపు రెండు గంటల పాటూ ప్రయత్నించినా అతడు లాకర్ రూమ్ డోర్ తెరచలేకపోయాడు. దీంతో బ్యాంకులో ఉంచిన బర్ఫీ, మిక్చర్ తినుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. చూరూ జిల్లా లోని రాజస్థాన్ గ్రామీణ బ్యాంకు లోకి ఓ దొంగ ప్రవేశించాడు. ఆ బ్యాంకు లాకర్ రూమ్ లో నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ గదిని తెరవడానికి ఆ వ్యక్తి ఎంతగానో ప్రయత్నించాడు. గోడను బద్దలు కొట్టాలని కూడా చూశాడు. రెండు గంటలు ప్రయత్నించినా చివరికి ఏమీ సాధ్యం కాలేదు. దీంతో ఒక కంప్యూటర్ ను తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే బ్యాంకులో ఉంచిన బర్ఫీ, మిక్చర్ ను తినుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. పాపం దొంగ అని నెటిజన్లు ఈ ఘటనపై కామెంట్లు చేస్తున్నారు.

వాచ్ మెన్ లేని ఈ బ్యాంకులో రాత్రి 12 గంటల సమయంలో చొరబడ్డాడు ఆ యువకుడు. ఓ రెండు గంటల పాటూ కష్టపడ్డాడు కానీ ఏదీ కొట్టేయలేకపోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ యువకుడిని పట్టుకునే పనిలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here