భ‌ర్త అయ్య‌ప్ప దీక్ష‌లో..భార్య ప‌రాయి వ్య‌క్తితో: గుట్టు ర‌ట్ట‌వుతుంద‌ని!

అయ్య‌ప్ప మాల ధ‌రించిన ఓ భ‌క్తుడు స్వామి ద‌ర్శ‌నం కోసం శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లాడు. ఇదే అదునుగా అత‌ని భార్య ప‌రాయి వ్య‌క్తితో త‌న ఇంట్లోనే దుకాణం పెట్టేసింది.

అత‌నితో ఏకాంతంగా గడుపుతూ కుమార్తె కంట ప‌డింది. ప‌రాయి వ్య‌క్తితో ఉండ‌టాన్ని కుమార్తెకు తెలిసిపోయిందన్న కార‌ణంతో.. ఆమెను హ‌త‌మార్చిందా మ‌హిళ‌.

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు కావేరి. వ‌య‌స్సు 16 సంవ‌త్స‌రాలు. ఆమెను హ‌త‌మార్చిన ఆ కిరాతక త‌ల్లి పేరు హారిక‌.

కావేరికి స‌వ‌తి త‌ల్లి. త‌న ప్రియుడితో క‌లిసి కావేరిని హ‌త‌మార్చింది. జిల్లాలోని కమలాపూర్‌ మండలం గూడూరులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన కరుణాకర్ 18 సంవ‌త్స‌రాల కింద‌ట శ్రీ‌దేవి అనే యువ‌తిని ప్రేమ‌వివాహం చేసుకున్నాడు.

వారికి కుమార్తె కావేరి ఉన్నారు. కుటుంబ క‌ల‌హాల‌తో శ్రీ‌దేవి 2009లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనితో క‌రుణాక‌ర్ 2011లో హారిక‌ను పెళ్లి చేసుకున్నాడు.

వారికి ఓ బాబు ఉన్నాడు. పెళ్లికి ముందే ఆస్తిని కావేరి పేరు మీద బ‌ద‌లాయించాడు. ఈ విష‌యం తెల‌సిన త‌రువాత హారిక త‌ర‌చూ కావేరితో గొడ‌వ‌ప‌డుతుండేది.

గూడూరుకే చెందిన వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకుంది. అయ్య‌ప్ప‌మాల వేసిన క‌రుణాక‌ర్ ఈ నెల 2న శబరిమలకు వెళ్లాడు. అదే రోజు హారిక త‌న ప్రియుడితో ఏకాంతంగా గ‌డిపింది.

వారిద్ద‌ర్నీ కావేరి చూసింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతాన‌ని హెచ్చ‌రించింది. త‌న గుట్టుర‌ట్ట‌వుతుంద‌నే ఉద్దేశంతో హారిక అదే రోజు రాత్రి కావేరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మ‌ల్ల‌మ్మ అనే వృద్ధురాలితో క‌లిసి కుట్ర ప‌న్నింది.

చున్నీతో కావేరికి ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త‌మార్చింది. అనారోగ్యంతో కావేరి చనిపోయిందని ప్రచారం చేసింది. ఈ విషయం కావేరి అమ్మమ్మకు తెలిసి అక్కడకు చేరుకుంది.

కావేరి మెడకు కుడివైపు, ముందు వైపున కమిలిన గాయాలున్నాయని, కరుణాకర్‌ ఇంట్లో లేని సమయంలో సవతి తల్లి హారికనే చంపి ఉంటుందని అనుమానం వ్య‌క్తి చేశారు.

ఇదే విష‌యాన్ని పోలీసుల‌కు తెలిపారు. కావేరి మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనారోగ్యం అంటూ ప్ర‌చారం చేసిన హారిక‌, మ‌ల్ల‌మ్మ‌ను ప‌ట్టుకుని విచారించ‌గా.. తామే ఈ హ‌త్య చేసిన‌ట్టు అంగీక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here