మొదట నాలుగైదు సార్లు పల్టీలు కొట్టింది.. ఆ తర్వాత ఏకంగా చెట్టు మీద ఇరుక్కుపోయింది..!

రాజస్థాన్ రాష్ట్రం లోని పాళీ ప్రాంతంలో ఓ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఎంతగా అంటే ఏకంగా 4-5 సార్లు కారు పల్టీలు కొట్టడమే కాకుండా.. ఏకంగా చెట్టు మీద ఇరుక్కునేసింది.

జైతారన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆగేవా గ్రామం దగ్గర ఉన్న మోగా హైవే ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. కారు ఏకంగా రోడ్డు పక్కన ఉన్న ఉసిరి చెట్టు మీదకు ఎక్కేసి.. ఇరుక్కుపోయింది. స్పీడ్ గా వస్తున్న కారును కంట్రోల్ చేయక పోవడంతో రోడ్డు మీదనే 4-5పల్టీలు కొట్టి.. ఎగిరి చెట్టు మీద అతుక్కుపోయింది. కారులో ఉన్న డ్రైవర్ రాజూ రాం ప్రజాపత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుండి అతన్ని జోద్ పూర్ ఆసుపత్రికి తరలించారు. అగేవా నుండి జైతారన్ కు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తుండగా కారును అదుపు చేయాలేకపోవడమే కారణం అయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here