న‌డివీధిలో తోటి మ‌హిళ గుండెల‌పై కూర్చుని చితగ్గొట్టింది..!

ఓ చిన్న విష‌యానికి ఇద్ద‌రు మ‌హిళ‌లు జుట్టు ప‌ట్టుకుని, కొట్టుకున్నారు. ఈ వ్య‌వ‌హారం పోలీసుల దాకా వెళ్లింది. మురుగునీరు త‌న ఇంటి ముందు రావ‌డానికి ప‌క్కింటావిడే కార‌ణ‌మంటూ తిట్లు అందుకోవ‌డంతో ఈ గొడ‌వ చెల‌రేగింది.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ఆగ్రా స‌మీపంలోని కాళింది విహార్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాళింది విహార్‌కు చెందిన రమాశర్మ, అమె పొరుగున ఉంటున్న మీరా కుమారికి మధ్య మురుగునీటి కాల్వ విష‌యంలో గొడ‌వ చెల‌రేగింది.

ఆదివారం ఈ గొడవ పీక్స్‌కు చేరుకుంది. రమాశర్మ, మీరా కుమారిని జుట్టు పట్టుకొని ఇంట్లోంచి వీధిలోకి లాక్కొచ్చింది. అనంత‌రం ఆమెను ఇష్టానుసారంగా కొట్టింది. కింద‌ప‌డేసి, ఆమె మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దింది.

మీరా కుమారి కూడా రమాశర్మను జట్టు పట్టుకొని ప్రతిఘటించడానికి ప్రయత్నించింనా ఫలితం లేకపోవడంతో కేకలు వేసింది. మీరా అరుపులు విన్న స్థానికులంతా అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు.

ఈ తతంగాన్నాంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో, ఇప్పుడది వైరల్‌గా మారింది. కాగా బాధితురాలి కుమారుడు దీనిపై పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here