రెండేళ్ళ పాటూ ఒకే డ్రస్ వేసుకున్న చిరంజీవి..!

చిరంజీవి కెరీర్ లో ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఏదంటే ‘అంజి’ సినిమా అనే చెబుతారు. అంతే కాకుండా ఆయన కెరీర్ లో ఎక్కువకాలం చిత్రీకరించిన సినిమా కూడా అదే.. 1997 అఫీషియల్ గా లాంచ్ చేసిన సినిమా 2004లో రిలీజ్ అయిందంటే ఎంత టైమ్ పట్టిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 5 ఏళ్ళు షూటింగ్ చేశారట..! ఈ చిత్ర విశేషాల గురించి కోడి రామకృష్ణ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతగానో కష్టపడ్డట్లు తెలుస్తోంది.’అమ్మోరు’ తరువాత చిరంజీవితో గ్రాఫిక్స్ కూడిన సినిమా చేయనున్నట్టుగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాకు చెప్పారు. దాంతో నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాను. గ్రాఫిక్స్ తో కూడిన సినిమా అంటే ఓ కొత్త ఆర్టిస్టులా మీరు కష్టపడవలసి ఉంటుంది అని అన్నాను. ‘కొత్త ఆర్టిస్టులా ఎంత కష్టమైనా పడటానికి నేను సిద్ధం .. గ్రాఫిక్స్ కి సంబంధించిన సినిమానే చేయండి’ అన్నారాయన. క్లైమాక్స్ సీన్ కోసం ఒక డ్రెస్ ను చిరంజీవిగారు రెండు సంవత్సరాలు వేసుకున్నారు. గ్రాఫిక్స్ కి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయన అలాగే ఆ డ్రెస్ తో చేసేవారు. ముందుగా చెప్పినట్టు ఒక కొత్త ఆర్టిస్టు మాదిరిగానే కష్టపడ్డారు. ఆ సినిమా పూర్తికావడానికి ఆయన గొప్పతనమే కారణమని ఆయన అన్నారు. అప్పట్లోనే ఈ సినిమా 28 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబడింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ చేయగా.. రమ్యకృష్ణ, రీమా సేన్, రాజలక్ష్మి లతో మూడు పాటలలో ఆడిపాడాడు చిరంజీవి. స్పెషల్ ఎఫెక్ట్స్ లో నేషనల్ అవార్డ్ గెలిచిన మొదటి సినిమా కూడా అదే.. ఆత్మలింగం సీన్ కానీ.. చివర్లో ఆకాశగంగ కిందపడడం కానీ ఇలాంటి ఎన్నో సీన్లు అద్భుతం అనిపించాయి మన వాళ్ళకు..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here