ఘోరమైన ఘటన.. విద్యార్థిని.. రాడ్లు, ఇటుకలతో కొట్టి చంపారు.. వీడియో బయటకు వచ్చింది..!

ఓ దళిత విద్యార్థిని ఎంతో క్రూరంగా ఇనుప రాడ్లతోనూ, ఇటుకలతోనూ కొట్టి చంపినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన అలహాబాద్ లోని కట్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి దళిత విద్యార్థి అయిన 24 సంవత్సరాల దిలీప్ సరోజ్ ను అతి కిరాతకంగా నడిరోడ్డుపై హత్య చేశారు. అతడు ఓ లా స్టూడెంట్.

Allahabad Districtさんの投稿 2018年2月11日(日)

ఓ రెస్టారెంట్ లో తన స్నేహితులతో కలసి దిలీప్ వచ్చాడు. అయితే ఓ ఎస్.యు.వి వాహనంలో వచ్చిన వారితో గొడవ జరిగింది. అయితే అవతలి వారి బలం.. బలగం ఎక్కువగా ఉండడంతో దిలీప్ ను చితక్కొట్టారు. అప్పటికే పడిపోయి ఉన్న దిలీప్ ను ఇటుకలతో కడుపు మీద వేయడం.. మొత్తం రికార్డు చేశారు కొందరు. అతన్ని కొందరు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా తల మీద బలమైన గాయాలు అయుండడంతో చనిపోయాడని ఆదివారం ఉదయం వైద్యులు తెలిపారు. అతడి మీద దాడి చేసిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని విజయ్ శంకర్ గా గుర్తించారు.

Allahabad Districtさんの投稿 2018年2月11日(日)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here