కొన్ని నిమిషాల్లోనే కోటీశ్వరుడు అయిపోయిన విద్యార్థి.. అకౌంట్ లో 5కోట్ల రూపాయలు..!

కొన్ని నిమిషాల్లో కోటీశ్వరుడు కావడం అంటే.. ఏదైనా సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. అంతే కానీ ఉన్నట్లుండి కోటీశ్వరుడు అవ్వడం అంటే అది నిజజీవితంలో జరగని పని..! అయితే ఈ ఫోటోలో చూస్తున్న విద్యార్థి మాత్రం నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. అది కూడా ఏకంగా 5 కోట్ల రూపాయలు అతడి అకౌంట్ లో వచ్చి చేరాయి. అందుకు కారణం మాత్రం బ్యాంకు అధికారుల తప్పే..!

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి కేశవ్ శర్మ అకౌంట్ లోకి 5 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వచ్చినట్లు మెసేజీ వచ్చింది. ఎస్బీఐ బ్యాంకులో ఉన్న అకౌంట్ లోకి ఏకంగా 5కోట్ల 55లక్షల 55వేల 555రూపాయలు వచ్చాయి. అయితే ఈ విషయం గ్రహించిన బ్యాంకు అధికారులు.. కొన్ని గంటల తర్వాత సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పు జరిగిందని.. అతడి అకౌంట్ లో ఉన్న డబ్బులను వెనక్కు తీసేసుకుంది. అయితే కేశవ్ అకౌంట్ లో ముందు ఉన్న డబ్బును కూడా తీసేసుకుని.. ఒక్క రూపాయి కూడా ఉంచకుండా చేసింది. దీనిపై కేశవ్ తండ్రి నరేంద్ర శర్మ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు తప్పును సరిదిద్దుకున్నారు సరే.. మరి మా అకౌంట్ లో ఉన్న డబ్బులను ఎందుకు తీసేసుకున్నారు అని టెన్షన్ పడుతున్నారు. తన కొడుకు అకౌంట్ లో 50వేలకు పైగా డబ్బులు ఉన్నాయని.. అయితే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదని చెబుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here