నేను ఎవ్వ‌రికీ భారం కాకూడ‌ద‌నే..!

`నేను ఎవ్వ‌రికీ భారం కాద‌ల‌చుకోలేదు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నా..` అని లేఖ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుందో విద్యార్థిని. ఆమె పేరు శాలిని. క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లా విరాజ్‌పేట‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విరాజ్‌పేట‌లోని శాంతిన‌గ‌ర‌లో నివ‌సించే శ్రీ‌నివాస్‌, విజ‌య దంప‌తుల కుమార్తె శాలిని. వ‌య‌స్సు 19 సంవ‌త్స‌రాలు. విరాజ్‌పేట‌లోని కావేరి క‌ళాశాల‌లో బీకాం ద్వితీయ సంవ‌త్స‌రం చదువుతోంది.

మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఆమె ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే అంశంపై స్ప‌ష్టమైన కార‌ణాలు తెలియ‌రావ‌ట్లేదు. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ఆమె ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుని ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విరాజ్‌పేట పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here