పిల్లిని తీసుకొని మైక్రో ఓవెన్ లోకి వేసిన యువకుడు.. అది ఏమైందంటే..!

ఈ కాలంలో కొందరు పిల్లలు మరీ శాడిస్టుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. మూగజీవాలను హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు వారు. కొద్ది రోజుల క్రితమే ఓ పిల్లాడు కుక్కను తీసుకొని మొసళ్ళు ఉన్న చెరువులోకి విసిరిన ఘటన మరువక ముందే.. ఇంకో 18 ఏళ్ల కుర్రాడు తన పెంపుడు పిల్లిని తీసుకొని మైక్రో ఓవెన్ లో వేశాడు.

అదేదో తాను పెద్ద ఘనకార్యం చేశానని అనుకున్నాడో ఏమో.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీనేజ్ పిల్లలంతా పార్టీ చేసుకుంటూ ఉండగా ఆ పిల్లిని అలా హింసించారు. సైబీరియా లోని క్రాస్నోయార్క్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 375 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండగా ఆ పిల్లిని ఆ ఓవెన్ లో వేశారు. ఓవెన్ లో వేసిన కుర్రాడిని 18 సంవత్సరాల కిరిల్ బెర్యోజీన్ గా గుర్తించారు. అతడు ఆ పని చేస్తుంటే పక్కన ఉన్న యువకులు వావ్.. 375 డిగ్రీలా.. సూపర్ అని అంటూ ఉన్నారు. ఇంకొకడు అయితే ఇంకో సారి చేద్దాం అని అడిగాడు. ఈ ఘటన మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

కిరిల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. అతడు రేడియో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతూ ఉన్నాడు. గతంలో అతడు తన పిల్లితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. అయితే ఏమైందో ఏమో దానితో పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వారిని అదుపులోకి తీసుకోనున్నారు. పాపం పిల్లి పరిస్థితి ఏమిటో ఇంకా తెలియరాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here