కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయాడు.. నాలుగో అంతస్థు నుండి కిందకు దూకాడు..!

పరీక్షల్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయిన ఓ విద్యార్థి చేసిన పని అతడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. మంగళవారం నాడు స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో అతన్ని పట్టుకొన్నారు. అతన్ని నాలుగు మాటలు తిట్టడంతో చాలా బాధపడిపోయాడు. దీంతో అతడు కాలేజీ బిల్డింగ్ నుండి దూకాడు. 19 సంవత్సరాల ఆ యువకుడి చావుకు కాలేజీ ప్రిన్సిపాల్ కారణమని విద్యార్థులు చెబుతున్నారు.

బీఎస్సీ చదువుతున్న సచిన్ వాఘ్ అనే వ్యక్తి పరీక్ష రాస్తూ ఉన్నాడు. అతడు కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ప్రిన్సిపాల్ వద్దకు అతన్ని పిల్చుకొని వెళ్ళారు. ప్రిన్సిపాల్ అతనితో తమ తల్లిదండ్రులను పిల్చుకొని రమ్మన్నాడు. దీంతో భయపడిపోయిన ఆ కుర్రాడు.. కాలేజీ బిల్డింగ్ మీదకు ఎక్కి కిందకు దూకేశాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ ఆ కుర్రాడి ప్రాణాలు కాపాడలేకపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here