బావ‌తో క‌లిసి బైక్ ఇంటికెళ్తుండ‌గా.. కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు

హ‌స‌న్‌: విద్యార్థిని అప‌హ‌ర‌ణ‌కు గురైన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ విద్యార్థిని పేరు పూజ. శ‌నివారం సాయంత్రం క‌ళాశాల నుంచి ఇంటికి వెళ్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను హ‌స‌న్ శివార్ల‌లోని మ‌ణ‌చ‌న‌హ‌ళ్లి స‌మీపంలో కారులో అప‌హ‌రించారు.

బాధిత విద్యార్థిని హ‌స‌న్‌లోని సెయింట్ ఫిలోమినా క‌ళాశాల‌లో బీకామ్ సెకెండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. కాలేజీ వ‌దిలిన త‌రువాత త‌న బావ‌తో క‌లిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండ‌గా.. మార్గ‌మధ్య‌లో కారులో వ‌చ్చిన కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అడ్డ‌గించారు.

ఆమె బావ‌ను కొట్టి, పూజ‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌నలో అభిషేక్ అనే యువ‌కుడి హ‌స్తం ఉంద‌ని కుటుంబ స‌భ్యులు అనుమానిస్తున్నారు. పూజ ఇదివ‌ర‌కు అభిషేక్‌ను ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు.

ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో పూజ కుటుంబీకులు ఈ పెళ్లికి అంగీకరించ‌లేదు. ఈ కార‌ణంతోనే అభిషేక్ త‌మ కుమార్తెను అప‌హ‌రించి ఉంటాడ‌ని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పెన్ష‌న్ మొహ‌ల్లా పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here