ప‌రీక్ష రాయ‌డానికి హ‌డావుడిగా వెళ్తోన్న యువ‌తిని స్కూలు ఎదుటే అడ్డ‌గించి..త‌ల న‌రికేశారు!

భోపాల్‌: ప‌రీక్ష రాయ‌డానికి హ‌డావుడిగా వెళ్తోన్న ఓ యువ‌తిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అడ్డ‌గించారు. స్కూల్ ఆవ‌ర‌ణ ఎదుటే ఆమెపై క‌త్తుల‌తో దాడి చేశారు. త‌ల న‌రికి చంపారు. ఆ త‌ల‌ను త‌మ వెంట తీసుకెళ్లారు.

ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు పూజా ప‌ణిక‌. ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది.

 

జిల్లాలోని కోట్మా గ్రామానికి చెందిన విద్యార్థిని ఆమె. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో వార్షిక ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ప‌రీక్ష‌లు రాయ‌డానికి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఆమె ప‌రీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆమెను గ‌మ‌నించిన దిలీప్ సాహు అనే వ్య‌క్తి ఆమెను స్కూలు గేటు వ‌ద్దే అడ్డ‌గించాడు. వెంట తెచ్చుకున్న క‌త్తితో దాడి చేశాడు. త‌ల న‌రికి పారిపోయాడు.

న‌రికిన త‌ల‌ను త‌న వెంట తీసుకెళ్లాడు. ఈ దారుణాన్ని ఓ ఉపాధ్యాయుడు మాత్ర‌మే గ‌మ‌నించారు. వెంట‌నే ఆయ‌న పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

హంత‌కుడిని తాను స్ప‌ష్టంగా చూడ‌లేక‌పోయాన‌ని ఆయ‌న చెప్పారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here