న‌మ్మించి..గొంతుకోయ‌డ‌మంటే ఇదే! ప్రేమ పేరుతో నాట‌కమాడి..గొంతుకోశాడు!

ప్రేమ పేరుతో ఓ బాలిక‌ను న‌మ్మించి, గొంతుకోశాడో కిరాత‌కుడు. ప్రేమ పేరుతో మెసం చేసి, అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు కోసం హ‌త‌మార్చాడు.

ఈ ఘ‌ట‌న కర్ణాటకలోని బీద‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని భాల్కి తాలూకా అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఆమె మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు.

హతురాలిని భాల్కి సమీపంలోని కోసామ్‌ గ్రామానికి చెందిన బాలిక‌గా గుర్తించారు. హత్యకు పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన షంషుద్దీన్‌ను అరెస్టు చేశారు.

శనివారం సాయంత్రం అతడి సూచన మేరకు ఆమె ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడే ఆమెను హతమార్చి నిందితుడు పరారయ్యాడు.

హత్యకు కారణాలు తెలియలేదు. అత్యాచారం చేసిన తరువాత హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. హతురాలి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా ధన్నూర పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here