పెంపుడు జంతువులంటే ఎంత ఇష్టమంటే..ఇష్టంగా పెంచుకుంటోన్న ఎలుక చ‌నిపోయింద‌ని!

తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఎలుక చనిపోయిందనే కార‌ణంతో ఓ బాలిక తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. చివ‌రికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అయోధ్య నగర్ పోలీసు స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

మృతురాలి పేరు దివ్యాన్షి రాథోడ్. 12 ఏళ్ల వ‌య‌స్సున్న ఈ బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చివ‌రికి ఎలుక‌ను కూడా పెంచుకునేది.

చిన్నతనం నుంచే ఓ శున‌కాన్ని బాలిక పెంచుకుంటోంది. కొద్ది నెలల క్రితమే కుక్క చనిపోయింది. కుక్క చనిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

కొంత‌కాలంగా ఆ ఒత్తిడి నుంచి తేరుకున్న త‌రువాత దివ్యాన్షి.. వారం రోజుల క్రితం నుంచి ఓ తెల్లటి ఎలుకను ఇంట్లోనే పెంచుకుంటోంది. అది కూడా శుక్రవారం చనిపోయింది.

దీనితో ఆ బాలిక ఒక్క‌సారిగా డిప్రెష‌న్‌కు గురైంది. చనిపోయిన ఎలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించింది. ఆ బాధ నుంచి తేరుకోలేక‌పోయింది. శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here