అబిడ్స్‌‌లో పదో అంతస్తు నుండి దూకేసింది.. ఆ యువతి చనిపోవడానికి కారణం తెలిసింది..!

హైదరాబాద్‌లోని అబిడ్స్‌‌లో స్థానిక మయూరి కాంప్లెక్స్ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి పడి ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనతో అందరూ షాక్ కు గురయ్యారు. జూన్ 5న ఉదయం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీట్‌ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. జెస్లీస్‌ భవనంలోని వెళ్లిన దృశ్యాలు, పై నుంచి దూకిన విజువల్స్‌ మీడియాకు చిక్కాయి.

శవపరీక్ష నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆ అమ్మాయి హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ అని తెలిపారు. వయసు 18 అని.. నిన్న విడుదలైన నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడిందని వివరించారు. ఏది ఏమైనా ఈ ర్యాంకుల గోలలో పడి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here