అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో ఇది! ఏంటో తెలుసా?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఇది. అదేప‌నిగా ఆయ‌న దీన్ని ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టారంటే దానికి కొద్దో, గొప్పో ప్రాధాన్య‌త ఉండే ఉంటుంది. దీని పేరు `కాంగ్డీ..`

HAPPY REPUBLIC DAY

A post shared by Allu Arjun (@alluarjunonline) on

మ‌న‌భాష‌లో నిప్పులు నింపిన కుండ అని సింపుల్‌గా చెప్పుకోవ‌చ్చు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కాంగ్డీ అని పిలుస్తారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్మూకాశ్మీర్ వంటి చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో ఈ నిప్పుల కుండ‌ను వాడుతుంటార‌ట‌.

సాధార‌ణంగా గ‌ది వేడెక్క‌డానికి హీట‌ర్లు వాడుతుంటారు. అంత ఆర్థిక స్థోమ‌త లేని కుటుంబీకులు ఈ కాంగ్డీని వినియోగిస్తుంటారు. `నా పేరు సూర్య‌..` సినిమా షూటింగ్ కోసం జ‌మ్మూకాశ్మీర్‌కు వెళ్లిన అల్లు అర్జున్ కూడా హీట‌ర్ల జోలికి పోలేదు. ఈ కాంగ్డీని వాడార‌ట‌.

 

హీట‌ర్ల కంటే ఈ నిప్పుల కుండే న‌యం అని కామెంట్ చేస్తూ ఆయ‌న ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఎండాకాలంలో కూడా జ‌మ్మూకాశ్మీర్ చ‌ల్ల‌గానే ఉంటుంది.

అలాంటి చోటికి చ‌లికాలంలో వెళ్లి ఓ పాట‌ను చిత్రీక‌రించింది `నా పేరు సూర్య` టీమ్‌. ఆ సంద‌ర్భంగా ఆయ‌న తాను బ‌స చేసిన హోట‌ల్ గ‌ది వెచ్చ‌గా ఉండ‌టానికి హీట‌ర్ బ‌దులు ఈ కాంగ్డీని వినియోగించారు. దీని ఫొటోను తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here