ఆర్మీలో చేరడానికి సిద్ధమైన అల్లుఅర్జున్..!

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అల్లు అర్జున్ డ్యాన్స్ కూ.. నటనకు మంచి పేరు వచ్చింది. కలెక్షన్లు కూడా ఈ మూడు రోజుల్లో బాగానే వసూలయ్యాయి. ఆర్మీ జవాన్ గా అల్లు అర్జున్ చూపించిన గట్స్ ను అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ సినిమా కోసం అతడు పడిన కష్టం కూడా అచ్చం ఒక జవాన్ లాగే ఉందని చిత్ర బృందం తెలిపింది.

అయితే ఓ ఆసక్తికరమైన విషయాన్ని బన్నీ ఈ చిత్ర సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ చూసిన తర్వాత అల్లు అర్జున్ ను కూడా ఆర్మీలో చేరాల్సిందిగా మేజర్ శ్రీనివాసరావు సూచించారు. దీనికి బన్నీ చెప్పిన సమాధానం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘షూటింగ్ సమయంలోనే నాకు ఈ ఆలోచన వచ్చింది. అందుకే అవసరమైన పత్రాలతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాను’ అని చెప్పాడు బన్నీ. ఆర్మీ జవాన్ గా పరకాయ ప్రవేశం చేసిన బన్నీ.. నిజంగానే ఆర్మీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడంటే నిజంగా అతడి గొప్పతనమే..! అయినా సినిమా చూసినోళ్ళు ఆర్మీలో జాయిన్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటే.. ఆ క్యారెక్టర్ ను చేసిన బన్నీ ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకోవడంలో తప్పు ఏముంది చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here