రంగమ్మ-మంగమ్మ వివాదంపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్.. రంగస్థలం సినిమా ఎందుకు తీశాడంటే..!

రంగస్థలం సినిమాలో రంగమ్మ-మంగమ్మ పాట మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా ముగించాలని భావించింది సినిమా బృందం. అందుకే మీడియా సమావేశంలో దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చేశారు. ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో అభ్యంతరకర పదాలు ఉన్నాయనడం సమంజసం కాదన్నారు. ‘గొల్లభామ’ అనే మాట మనుషులకు సంబంధించింది కాదని, అది ఒక రకమైన పురుగు పేరని స్పష్టం చేశారు. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందని అన్నారు. ఆ పాటలో మహిళలకు కించపరిచేలా పదాలు ఉన్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లైన్‌ను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించడంతో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది.

ఈ సినిమాను ఎందుకు తీశానో కూడా సుకుమార్ చెప్పారు. ” నేను ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాను. సినిమాల్లోకి వచ్చేవరకూ పల్లెటూరే నా ఇల్లు. అలాంటి నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా విదేశాల్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను” అన్నాడు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ‘సార్ .. మీరు చాలా బాగా సినిమాలు తీస్తున్నారుగానీ, మన తెలుగు నేటివిటీ నేపథ్యంలో ఎందుకు సినిమాలు చేయడం లేదు? అని అడిగారు. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది .. ఫలితంగానే గ్రామీణ నేపథ్యంలో కూడిన ఈ కథ సిద్ధమైంది. పల్లె పట్ల నాకు గల మమకారాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది” అని ఆయన అన్నారు. ఈ నెల 18వ తేదీన వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here