బొడ్డుతాడు కోయ‌మంటే..నిర్ల‌క్ష్యంతో ప‌సికందు పీక కోసిన డాక్ట‌ర్‌!

ఓ డాక్ట‌ర్ నిర్ల‌క్ష్యం ఖ‌రీదు అప్పుడే పుట్టిన ప‌సికందుకు శాప‌మైంది. క‌న్ను తెరిచిన క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే క‌న్నుమూశాడా ప‌సిగుడ్డు శాశ్వ‌తంగా. దీనికి కార‌ణం.. డాక్ట‌ర్ నిర్ల‌క్ష్యం. బొడ్డు తాడు కోయ‌బోయి.. ఆ ప‌సికందు పీక‌ను క‌త్తిరించాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర ర‌క్త‌స్రావ‌మై ఆ చిన్నారి క‌న్నుమూశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో చోటు చేసుకుంది.

26 సంవ‌త్స‌రాల రేష్మీ.. మంగ‌ళ‌వారం సాయంత్రం సుల్తాన్‌పూర్ ఆసుప‌త్రిలో పండంటి మ‌గ‌బిడ్డ‌ను ప్ర‌స‌వించింది. మ‌గ‌బిడ్డ పుట్టాడ‌నే సంతోషం కొన్ని క్ష‌ణాల్లోనే ఆవిరైపోయింది ఆమెకు, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు. కాన్పు చేసిన త‌రువాత డాక్ట‌ర్ నాథూరామ్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతున్నారు రేష్మీ కుటుంబ స‌భ్యులు. బొడ్డుతాడు క‌త్తిరించాల్సిన డాక్ట‌ర్ ఆ ప‌సిగుడ్డు పీక‌ను కోశాడు.

ఈ ఘ‌ట‌నలో ఆ బాబు ప్రాణం గాల్లో క‌లిసింది. బాబు ప్రాణం లేకుండా జ‌న్మించాడ‌ని నమ్మించ‌బోయాడు డాక్ట‌ర్‌. గొంతుపై క‌త్తిగాటు ఉండ‌టంతో కుటుంబ స‌భ్యులు అనుమానించారు. డాక్ట‌ర్‌ను నిర్బంధించారు. ఆయ‌న‌పై చేయి చేసుకున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నాథూరామ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here