దుమ్ము దులిపిన డివిలియర్స్, మొయిన్ అలీ.. సన్ రైజర్స్ టార్గెట్ 219..!

తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది. అది కూడా పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ మీద.. ఏకంగా 218 పరుగులు రాబట్టారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ కు మొదటి ఓవర్ లోనే షాక్ ఇచ్చాడు సన్ రైజర్స్ పేసర్ సందీప్ శర్మ. పార్థివ్ పటేల్ ను ఒక్క పరుగుకే అవుట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు. ఇక డివిలియర్స్ కు జత కలిసిన మొయిన్ అలీ మొదటి బంతి నుండే బంతిని బలంగా బాదాడు. డివిలియర్స్ 39 బంతుల్లో 69 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఏబీడీ ఏకంగా 12 ఫోర్లు కొట్టడం విశేషం. మొయిన్ అలీ అర డజను సిక్సర్లతో సన్ రైజర్స్ మీద విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో 65 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివర్లో కోలిన్ డి గ్రాండ్హోమ్ 17 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. సర్ఫరాజ్ ఖాన్ 8 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 218 పరుగులు చేసింది ఆర్సీబీ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here