బౌలర్లు అదరగొట్టారు.. ధావన్ దంచాడు.. వార్ వన్ సైడ్..!

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించింది. మొదట బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేయర్స్ ను ఓ ఆట ఆడుకోగా.. చేజింగ్ లో ధావన్ చితక్కొట్టాడు. ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. సంజూ శాంసన్ తప్ప వేరే ఏ ఒక్కరు కూడా పెద్దగా రాణించలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ సాహా(5) వికెట్ కోల్పోయింది. అయితే ధావన్ (77) ధాటిగా ఆడి చేయాల్సిన పరుగుల కంటే బంతులే ఎక్కువయ్యేలా చేసేశాడు. అతనికి జత కలిసిన విలియమ్సన్ (36) నిలకడ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు కేవలం 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 127 పరుగులు చేసి అలవోక విజయాన్ని నమోదు చేసింది. ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. నెట్ రన్ రేట్ బాగా ఉండడంతో సన్ రైజర్స్ మొదటి స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here