ఆడాళ్లు కుళ్ల‌కునే కురులు..! ఆమె ఎత్తు అయిదున్న అడుగులు..జుట్టు పొడ‌వు ఆర‌డుగులు!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న యువ‌తి పేరు ఆలియా న‌సైరోవా. సుమారు రెండ‌డుగుల ఎత్త ఉన్న ఓ సిమెంట్ దిమ్మెపై నిల్చుని త‌న కురుల‌ను జార విడిచింది. అంతే! అటుగా వెళ్లే జ‌నమంతా ఆమె చుట్టూ మూగారు. ముక్కున వేలేసుకున్నారు. అంత‌టితో ఆగారా? సెల్ఫీ దిగారు. ఆమె కురుల‌ను చూసి కుళ్ల‌కుంటూనే మెచ్చుకున్నారు. చిట్కాలు చెప్ప‌మంటూ చుట్టుమూగారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆలియా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్ల‌గాలికి తెర‌లు తెర‌లుగా జుట్టు గాలికి రేగుతూ జ‌నాన్ని, ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌ను క‌ద‌ల‌నీయ‌లేదు. అడుగు ప‌డ‌నీయ‌లేదు. క‌ట్టి ప‌డేసిందంతే! ఈ వీడియో పోస్ట్ చేసి నెల‌రోజులు దాటిపోయిన‌ప్ప‌టికీ.. దాని ట్రెండ్ మాత్రం త‌గ్గ‌ట్లేదు. స్లొవేకియాలోని బ్ర‌టిస్లావాలో లాంగ్ హెయిర్ సూప‌ర్ గ‌ర్ల్ అనే పేరును సంపాదించింది ఆలియా.

కొన్నేళ్ల‌పాటు శ్ర‌ద్ధ‌గా జుట్టును పెంచ‌డం వ‌ల్ల ఇది సాధ్య‌మైంద‌ని చెబుతోంది. అంద‌రూ అదే ప‌ని చేసిన‌ప్ప‌టికీ.. జుట్టు మ‌ధ్య‌లో చిట్లి పోవ‌చ్చ‌ని, కొన్ని చిట్కాలు పాటించ‌డం ద్వారా ఇలా పెంచుకోవ‌చ్చ‌ని అంటున్నారు. ఆలియా ఎత్తు అయిదున్న‌ర అడుగులు కాగా.. ఆమె పెంచిన జుట్టు పొడ‌వు ఆర‌డుగులు పైమాటే కావ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here