ఎక్క‌డి టాలీవుడ్‌..ఎక్క‌డి హాలీవుడ్‌: టామ్‌క్రూయిజ్ ఎఫ్‌బీ పేజీలో మ‌న హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య..

ఎక్క‌డి హాలీవుడ్‌, ఎక్క‌డి టాలీవుడ్‌. టాలీవుడ్‌లో ఇద్ద‌రు టాప్ హీరోల అభిమానుల మాట‌ల‌తో కొట్టుకుంటున్నారు. మాటల తూటాల‌ను సంధించుకుంటున్నారు.

ఒక‌రికొక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎక్క‌డ‌? ఓ హాలీవుడ్ యాక్ష‌న్ హీరోకు సంబంధించిన అఫీషియ‌ల్ ఫేస్‌బుక్ పేజీలో. ఆ హాలీవుడ్ హీరో.. టామ్ క్రూయిజ్‌.

మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ ద్వారా మ‌న‌దేశంలోనూ అభిమానుల‌ను సంపాదించుకున్న హీరో టామ్ క్రూయిజ్. ఆయ‌న అఫీషియ‌ల్ ఫేస్‌బుక్ పేజీ వేదిక‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది.

దీనికి కార‌ణం.. మ‌హేష్‌బాబును టాలీవుడ్ టామ్‌క్రూయిజ్‌గా గుర్తించ‌డ‌మే. దీనితో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోయారు. త‌మ హీరోనే మాస్ అని, టామ్‌ను మించిన మాస్ అంటూ పోస్టులు గుప్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here