మ‌హేష్‌..శ్రీ‌మ‌తికి ఓ క్యూట్ కిస్‌..

హైద‌రాబాద్‌: 48 గంట‌లు. ఈ కాస్త గ్యాప్‌లోనే టాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను అందుకున్న సినిమా `భ‌ర‌త్ అనే నేను..`. రెండంటే రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయ‌ల క్ల‌బ్‌లో చేరిన మొట్ట‌మొద‌టి చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నింటినీ తుడిచి పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కుల అంచ‌నా.

ఇంతటి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న ప్రిన్స్‌.. ఇప్పుడేం చేస్తున్నాడు? ఈ విజయాన్ని ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు? అనే ప్ర‌శ్న‌ల‌కు ఇదొక స‌మాధానం. త‌న కుటుంబంతో క‌లిసి హాయిగా ఈ సినిమా అందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు ప్రిన్స్‌. త‌న భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్‌కు ఓ క్యూట్ కిస్ ఇచ్చాడు.

ఈ పిక్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నిజానికి- సినిమా విడుద‌లైన త‌రువాత కుటుంబంతో క‌లిసి విదేశాల‌కు వెళ్ల‌డం మ‌హేష్ అలవాటు. ఈ సినిమా ఇచ్చిన భ‌రోసాతో ఈ సారి విడుద‌ల‌కు ముందే ఫారిన్ టూర్ వెళ్లొచ్చాడు. శ‌ని, ఆదివారాల్లో ఇంట్లోనే ఉండి సినిమా హిట్‌ను ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

Thankyou my love ❤

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here