`భ‌ర‌త్ అనే నేను..` అంటూ కృష్ణ‌ను గుర్తుకు తెచ్చిన మ‌హేష్‌బాబు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న తాజా చిత్రం `భ‌ర‌త్ అనే నేను..` కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌.

ఈ సినిమాలో మ‌హేష్‌బాబు ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నారు. ` భరత్ అను నేను..` అంటూ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తోన్న గొంతును వినిపిస్తూ ఓ 50 సెకెన్ల వీడియోను టీజ‌ర్ త‌ర‌హాలో ఆవిష్క‌రించారు. మ‌హేష్ వాయిస్‌.. అచ్చు సూప‌ర్‌స్టార్ కృష్ణ గొంతును గుర్తుకు తెచ్చింది.

`భ‌ర‌త్ అను నేను శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ఈ వాయిస్ పూర్త‌వుతుంది.

దీనికి బ్యాక్‌గ్రౌండ్‌గా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధుల స‌మూహాన్ని ఉన్న ఓ పోస్ట‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది.

Here you go. Bharath takes his First Oath!#BharathAneNenu

Mahesh Babuさんの投稿 2018年1月25日(木)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here