గుబురు గెడ్డం, మీసంతో సూప‌ర్‌స్టార్..`రాజ‌సం`!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌ని లుక్‌తో క‌నిపించారు. ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెలుప‌ల ఆయ‌న త‌ల‌పై క్యాప్‌, కూలింగ్ గ్లాసెస్‌, బ్లాక్ జీన్స్‌ప్యాంట్‌, లైట్ బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్‌తో జ‌స్ట్ క్యాజువ‌ల్‌గా, కూల్‌గా కనిపించారు. వంశీ పైడిప‌ల్లితో తీయ‌బోయే త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మ‌హేష్‌బాబు గెడ్డం, మీసంతో క‌నిపించ‌నున్నారు.

ఈ సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌గా సాగుతుంద‌నేది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ఈ సినిమాకు ఇంకా పేరు ఖ‌రారు చేయ‌లేదు. `రాజ‌సం` అనే టైటిల్ పెట్టొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అల్ల‌రి న‌రేష్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఊపిరి హిట్ త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇదే. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here