తలైవా రజనీకాంత్.. ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇవ్వబోతున్నారు..!

తూత్తుకుడి.. గత కొద్ది రోజులుగా అట్టుడికిపోయింది. తమకు స్వేఛ్చగా గాలి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వరా అని ప్రజలు తలపెట్టిన నిరసన చివరికి రక్తపాతానికి దారి తీసింది. పోలీసుల కాల్పుల్లో 13 మంది చనిపోయారు. స్టెరిలైట్ ప్లాంట్ వల్ల ఉద్యోగాల మాట దేవుడెరుగు మొత్తం వాతావరణం నాశనం అవుతాయని అందరూ నెత్తీనోరు మొత్తుకొన్నారు.. చివరికి ప్రభుత్వం కూడా తలొగ్గింది. ఆ ప్లాంట్ ను అక్కడి నుండి తీసి పడేస్తామని చెప్పారు. దీంతో ప్రస్తుతం అక్కడి వాతావరణం చల్లబడింది.

తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసుల చేతిలో 13 మంది మృత్యువాత పడిన కుటుంబాలను సినీనటుడు రజనీకాంత్‌ పరామర్శించారు. వారికి రూ.2 లక్షల చొప్పున తాను పరిహారం ఇస్తానని ప్రకటించారు. స్టెరిలైట్‌ కాపర్ ప్లాంట్ యజమానులు కూడా అమానవీయంగా ప్రవర్తించారని, ఆ ప్లాంట్ ఇక ఎప్పటికీ తెరచుకోవడానికి వీల్లేదని అన్నారు. ఈ ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని, ఇంతటి అల్లర్లు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేకపోయారని అన్నారు. ప్రజలు అన్నిటినీ గమనిస్తూనే ఉన్నారని.. వారికి సరైన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు తలైవా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here