ఈ అగ్నిప‌ర్వ‌తం గ‌న‌క పేలితేనా!

చుట్టూ స‌ముద్రం.. మ‌ధ్య‌లో పొగ‌లు క‌క్కుతున్న అగ్ని ప‌ర్వ‌తం. దాని పేరు కికాయ్. జ‌పాన్ తీర ప్రాంతం నుంచి కొన్ని నాటిక‌న్ మైళ్ల దూరంలో ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో ఉన్న అగ్నిప‌ర్వ‌తం ఇది. గ‌తంలో ఎప్పుడూ లేనంతగా.. ఈ సారి ఈ అగ్నిప‌ర్వ‌తం పొగ‌లు క‌క్కుతోంది.

స‌మీప భ‌విష్య‌త్తులో పేలే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు కోబె యూనిర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు. ఇది పేలితే అసాధార‌ణ రీతిలో న‌ష్టం సంభ‌విస్తుంద‌ని అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. స‌ముద్ర ఉపరిత‌లం నుంచి పైకి ఎంత ఎత్తున ఉందో.. దానికి ఎన్నో రెట్లు ఈ స‌ముద్రంలో ఉంది.

ఒక్క‌సారి ఈ అగ్నిప‌ర్వ‌తం అడుగు భాగం నుంచి పేలితే.. భ‌యంక‌ర సునామీ త‌ప్ప‌ద‌నే భ‌యాన్ని శాస్త్రవేత్త‌లు వ్య‌క్తం చేస్తున్నారు. దీని ప్ర‌భావం క‌నీసం కోటి మంది జ‌నాభాపై ప‌డుతుంద‌ని అంటున్నారు.

న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయిన‌ప్ప‌టికీ.. గ‌తంలో సునామీ సృష్టించిన బీభ‌త్సాన్ని త‌ల‌చుకుంటే వ‌ణుకు పుడుతుంది. స‌ముద్రంలో సంభ‌వించిన భూకంపానికే సునామీ పుట్టి, అంత పెద్ద ఎత్తున న‌ష్టాన్ని మిగిల్చింది.

దానికి ఎన్నో రెట్ల శ‌క్తిమంతంగా ఉండే అగ్నిప‌ర్వ‌తం స‌ముద్రం లోప‌ల పేలితే.. దాని తీవ్ర‌త‌కు సునామీ రావ‌డం ఖాయ‌మ‌ని, అది మిగిల్చే న‌ష్టాన్ని అంచ‌నా కూడా వేయ‌లేమ‌నీ అంటున్నారు కోబె యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు.

 

ఈ అగ్నిప‌ర్వ‌తం నుంచి పొగ‌లు రావ‌డానికి కొద్దిరోజుల ముందు ఈ యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు, జియోలాజికల్ సైంటిస్టులు ప్ర‌త్యేకంగా ఓ జ‌లాంత‌ర్గామిని వేసుకుని మ‌రీ వెళ్లి స‌ర్వే చేశారు.

స‌బ్ మెరైన్ రోబోల‌ను కూడా ఉప‌యోగించార‌ట‌. సిస్మోగ్రాఫ్స్‌, ఎల‌క్ట్రోమాగ్నెటోమీట‌ర్ల ద్వారా ఇప్ప‌టికీ స‌ర్వే చేస్తున్నారు.  స‌ముద్రం లోప‌ల సుమారు 10 కిలోమీట‌ర్ల మేర వ్యాసార్థంతో ఈ ప‌ర్వ‌తం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here