బ్యాంకు అకౌంట్లు, సిమ్ కార్డుకు ఆధార్ నంబ‌ర్‌తో లింకులు ఇప్ప‌ట్లో అక్క‌ర్లేదు: సుప్రీం!

న్యూఢిల్లీ: ఆధార్‌కార్డు నంబ‌ర్‌ను బ్యాంకు అకౌంట్‌, సిమ్‌కార్డుతో లింక్ చేశారా? ఇంకా లింక్ చేయ‌లేదా? ఇక ఆ అవ‌స‌రం లేదు. ఆధార్‌కార్డు నంబ‌ర్‌ను బ్యాంకు అకౌంట్లు, సిమ్ కార్డుతో అనుసంధానించుకోవాల్సిన తేదీని సుప్రీంకోర్టు పొడిగించింది. ఫ‌లానా తేదీ అంటూ ఎలాంటి గ‌డువూ విధించ‌లేదు. నిర‌వ‌ధికంగా పొడిగించింద‌న్న‌మాట‌.

తాము తదుప‌రి ఉత్త‌ర్వులు గానీ, ఆదేశాలు గానీ ఇచ్చేంత వ‌ర‌కూ ఆధార్‌కార్డు నంబ‌ర్‌ను బ్యాంకు అకౌంట్లు, సిమ్ కార్డుల‌తో అనుసంధానించుకోన‌క్క‌ర్లేద‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు మంగ‌ళ‌వారం తీర్పు ఇచ్చారు. పాస్‌పోర్టుకు కూడా ఇదే వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించారు. నిజానికి- ఈ నెల 31వ తేదీ నాటికి బ్యాంకు అకౌంట్లు, సిమ్‌కార్డు నంబ‌ర్ల‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సి ఉంది. ఈ గ‌డువును నిర‌వ‌ధికంగా పొడిగించింది సుప్రీంకోర్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here