శ్రీదేవి మరణంపై దర్యాప్తా.. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే..?

ప్రముఖ నటి శ్రీదేవి మరణం దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఎంతగానో కలచివేసింది. అంత హఠాత్తుగా చనిపోతుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఎన్ని కథనాలు ప్రసారం అయ్యయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా ఓవర్ యాక్షన్ ను కూడా భారీగా ఎండగట్టారు. ఇలాంటి తరుణంలో ఆమె మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దుబాయ్ లోని హోటల్ లో ఆమె బాత్ టబ్ లో ఊపిరి ఆడకుండా మరణించడంపై తనకు అనుమానాలు ఉన్నాయని నిర్మాత సునీల్ సింగ్ సందేహాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. తాను దుబాయిలోని హోటల్ సిబ్బంది నుంచి, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నుంచి, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మీడియాలో వచ్చిన దానికి భిన్నంగా ఉందని సునీల్ సింగ్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆ దేశం ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకొని ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది సుప్రీంకోర్టు. దుబాయిలో బంధువుల వివాహ వేడుకకు హాజరైన సందర్భంలో ఫిబ్రవరి 24న హోటల్ గదిలోని నీటి తొట్టిలో శ్రీదేవి ఊపిరాడకుండా మరణించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటూ ఆమె భౌతికకాయం అక్కడే ఉండి.. ఆ తర్వాత భారత్ కు తీసుకొని వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here