సూర‌త్ గ్యాంగ్‌రేప్! ఆ తొమ్మిదేళ్ల బాలిక ఎవ‌రో ఇప్ప‌టికీ తెలియ‌రావ‌ట్లేదు!

అహ్మ‌దాబాద్‌: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఉన్నౌ, జ‌మ్మూ కాశ్మీర్‌లోని క‌థువా అత్యాచారాల‌ను మించిన మ‌రో దారుణ ఉదంతం గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత్యంత పైశాచికంగా వ్య‌వ‌హ‌రించారు. దారుణంగా అత్యాచారం చేసి, హ‌త్య చేశారు.

ఆ బాలిక మృత‌దేహంపై 86 గాయాలు ఉన్నాయంటే.. ఆ దుర్మార్గులు ఏ స్థాయిలో హింసించి ఉంటారో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుని ఎనిమిది రోజులైన‌ప్ప‌టికీ.. వారి ప‌శువాంఛ‌కు బ‌లైన ఆ చిన్నారి ఎవ‌రో ఇప్పటికీ తెలియ‌రాలేదు. మృతురాలు ఒడిశాకు చెందిన బాలిక అయి ఉండొచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి.

ఇదే విష‌యాన్ని గుజ‌రాత్ హోమ్ శాఖ మంత్రి ధృవీక‌రించారు. అంత‌కుమించి- ఆ బాలిక గురించి ఇత‌ర వివరాలేవీ తెలియ‌రావ‌ట్లేద‌ని, దీనిపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ నెల 6వ తేదీన సూర‌త్‌లోని బెస్తాన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం సమీపంలో శరీరం నిండా గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పాండేస‌ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలిక మృత‌దేహానికి అయిదు గంటల పాటు పోస్ట్‌మార్ట‌మ్ నిర్వ‌హించారు. గొంతు నులిమి చంపేసినట్టు తేల్చారు. చిన్నారిని ఎనిమిది రోజులపాటు నిర్బంధించి, అత్యాచారం చేశార‌ని పాప శరీరంపై ఏకంగా 86 గాయాలు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు.

ఇన్ని రోజులైన‌ప్ప‌టికీ.. బాలిక కోసం ఎవరూ రాలేదని పోలీసులు చెప్పారు. ఆ బాలిక ఒడిశాకు చెందిన వారై ఉండొచ్చ‌ని అనుమానాలు ఉన్నాయి.

ఒడిశా నుంచి పాప‌ను ఎత్తుకొచ్చి, సూర‌త్‌లో నిర్బంధించ‌డ‌మో లేక‌, అక్క‌డే చంపి, ఇక్క‌డ తీసుకొచ్చి పారేయ‌డ‌మో చేసి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. బాలిక గురించి కానీ, ఆమె కుటుంబ సభ్యుల గురించి కానీ వివరాలు చేప్పే వారికి రూ.20 వేల బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here