చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..!

రెండేళ్ళ నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో పాల్గొనబోతోంది. స్పాట్ ఫిక్సింగ్ వివాదం నేపథ్యంలో చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ళ పాటూ సస్పెండ్ చేశారు. అయితే ఈ ఏడాది చెన్నై జట్టు ముగ్గురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకుంది. అలా రీటైన్ చేసుకున్న వాళ్ళలో ధోని, రైనా, జడేజా ఉన్నారు.

అయితే కెప్టెన్ ఎవరు అన్న విషయంలో క్లారిటీ కూడా ఇచ్చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, టీ20 స్పెషలిస్ట్ అయిన రైనా తమ నాయకుడు ఎప్పటిలాగే మహేంద్రసింగ్ ధోని అని చెప్పేశాడు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అని.. తాను వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నానని చెప్పాడు. అలాగే తమ వెంట ఎలాగూ జడేజా ఉన్నాడని.. మిగిలిన వాళ్ళను వేలంపాటలో తీసుకోనున్నామని చెప్పాడు. గత ఐపీఎల్ లో ధోని పూణే జట్టు తరపున ఆడాడు. ధోని ని కెప్టెన్ గా తొలగించి.. స్టీవ్ స్మిత్ ను చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ధోని అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here