బాంబ్ బ్లాస్ట్ లో చేతులు పోగొట్టుకుంది.. ఎంతో మందిలో స్పూర్థిని నింపుతూ..!

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.. వాటిని తట్టుకొని నిలబడి ఏదైనా సాధించినప్పుడే వారిని ప్రపంచం గుర్తిస్తుంది. అలాంటి స్టోరీయే మాళవిక అయ్యర్ ది.. 13 ఏళ్ల వయసులో బాంబ్ బ్లాస్ట్ కారణంగా చేతులు పోగొట్టుకుంది మాళవిక అయ్యర్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో ప్రసంగించడానికి వెళ్ళింది.

13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మాళవిక బాంబ్ బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడింది. అప్పుడు ఆమె రెండు చేతులూ కోల్పోయింది.. అలాగే కాళ్ళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాదాపు ఆరు నెలల పాటూ ఆమె నడవలేకపోయింది. 18 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత బయటకు వచ్చింది. ఈ ఘటనతో తాను తన స్కూల్ లైఫ్ ను మిస్ అయ్యానని చెప్పుకొంది. ఆ తర్వాత చదువు మీద మాళవిక దృష్టి పెట్టింది. పదవతరగతి పరీక్షల్లో ఏకంగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించింది.

అప్పుడు మాళవిక తన లాంటి వారిలో ఎంతో మంది గొప్పవారు అయ్యారని గుర్తించింది. వారిలా తాను కూడా అవ్వాలని అనుకుంది. తన ప్రాణాలు ఇంకా ఉన్నాయి కదా ఎంతో సాధించవచ్చు అని అనుకుంది. తన లాంటి వారికి ఆదర్శంగా నిలవడం నేర్చుకుంది. తన మాటలతో ఉత్తేజపరుస్తూ చదువులో రాణిస్తూ ముందుకు వెళ్ళింది. పీహెచ్డీ కూడా సంపాదించింది. వరల్డ్ ఎమర్జింగ్ లీడర్స్ అవార్డ్ ను న్యూయార్క్ లో అందుకుంది. గత ఏడాది యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ నుండి ఆమె ఆహ్వానం కూడా అందుకుంది.

మోటివేషనల్ స్పీకర్ గా ఎంతో మందిలో ఆత్మవిశ్వాసం నిపింది. ‘నన్ను చూడండి.. చేతులు లేకున్నా పీహెచ్డీ చేశాను.. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ చెడ్డ రోజులు ఉంటాయి.. అది ఒక చాప్టర్ మాత్రమే.. జీవితంలో మార్పులు తీసుకోచ్చేది ఒకే ఒక్కరు.. అది నువ్వే’ అంటూ ఎంతో మందిలో చైతన్యం తీసుకొస్తోంది మాళవిక.

“I was an inquisitive child — at 13, I was rummaging through my garage when my life changed forever. There had been a…

Humans of Bombayさんの投稿 2018年2月18日(日)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here