సుష్మాస్వ‌రాజ్ విమానం మిస్సింగ్.. 14 నిమిషాల త‌రువాత‌!

విదేశాంగ శాఖ‌ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రయాణిస్తోన్న విమానం క‌ల‌క‌లం రేపింది. కొన్ని నిమిషాల పాటు ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. మారిషస్‌కు వెళ్తున్న వైమానికదళ విమానం మేఘ్‌దూత్ ఆ దేశ గగనతలంలో ప్రవేశించాక ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 14 నిమిషాలపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది.

శనివారం మధ్యాహ్నం 2.08 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరిన విమానం సాయంత్రం 4.44 గంటలకు మారిషస్ గగనతలంలో ప్ర‌వేశించింది. ఆ త‌రువాత 4.58 నిమిషాల పాటు మాలి ఏటీసీతో సంబంధాలను కోల్పోయింది. అప్పటికే అలారం మోగించి మాలీ విమానాశ్ర‌యం ఏటీసీ అధికారులను అప్రమత్తం చేశామని మన‌దేశ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ వెల్ల‌డించింది.

4:59 నిమిషాల‌కు ఆ విమానం మాలి విమానాశ్ర‌యంలో సురక్షితంగా దిగిందని తెలిపారు. దీంతో సుష్మాస్వరాజ్ యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్, విదేశాంగ శాఖ మంత్రి విష్ణు లచ్మీనారైడుతోనూ భేటీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here