ద‌త్త‌త తీసుకున్న కుమార్తె, అల్లుడితో నివ‌సిస్తోన్న మ‌హిళ దారుణ‌హ‌త్య‌!

బెంగ‌ళూరు: మ‌హిళ ఒక‌రు దారుణ‌హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను గొంతు నులిమి హ‌తమార్చారు. హ‌తురాలి పేరు విజ‌య‌. బెంగ‌ళూరు చామ‌రాజ పేట‌లో నివాసం ఉంటున్నారు. ఆమెకు భ‌ర్త‌, ద‌త్త‌త తీసుకున్న కుమార్తె ఉన్నారు.

పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో ఆమె త‌న స‌మీప బంధువుల అమ్మాయిని ద‌త్తత తీసుకున్నారు. ఆ యువ‌తి త‌న ఓ యువ‌కుడిని ప్రేమించింది. తాను ప్రేమించిన యువ‌కుడికి ఇచ్చి పెళ్లి చేయాలంటూ ద‌త్త కుమార్తె కొద్దిరోజులుగా త‌ల్లిపై ఒత్తిడి తీసుకొస్తోంద‌ని విజ‌య బంధువులు చెబుతున్నారు.

ఈ విష‌య‌మై వారం రోజుల కింద‌ట ఇంట్లో గొడ‌వ కూడా చోటు చేసుకుంద‌ట‌. దీనితో- ద‌త్త కుమార్తె ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తాను ప్రేమించిన యువ‌కుడిని పెళ్లి చేసుకుంద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. పెళ్లి చేసుకుని భ‌ర్త‌తో క‌లిసి ఇంటికొచ్చిన ద‌త్త కుమార్తె ఆస్తి కోసం ఒత్తిడి తెచ్చింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో.. విజ‌య దారుణ‌హ‌త్య‌కు గురి కావ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై చామ‌రాజ పేట పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here