అనుమానాస్ప‌ద స్థితిలో మ‌హిళ మృతి

ధార్వాడ‌: అనుమానాస్ప‌ద స్థితిలో ఓ మ‌హిళ మ‌ర‌ణించిన సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు ల‌క్ష్మి రొట్టి. 24 సంవ‌త్స‌రాల ల‌క్ష్మి మ‌ర‌ణించే స‌మ‌యానికి అయిదు నెల‌ల గ‌ర్భిణి. నాలుగేళ్ల కింద‌ట శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తితో ఆమెకు వివాహ‌మైంది.

పెళ్ల‌యిన త‌రువాత భ‌ర్తతో క‌లిసి ధార్వాడ తాలూకా ప‌రిధిలోని మ‌న‌గుండి మార్గంలో నివ‌సిస్తున్నారు. వారికి ఓ కుమారుడు. శ్రీ‌నివాస్ సొంతంగా మెడిక‌ల్ షాప్‌ను నిర్వ‌హిస్తున్నాడు. పెళ్లి స‌మ‌యంలో 25 వేల రూపాయ‌ల న‌గ‌దు, తులంన్న‌ర బంగారాన్ని ఇచ్చారు. ఆ మొత్తంతో సంతృప్తి చెంద‌క‌.. త‌ర‌చూ అద‌న‌పు క‌ట్నం తీసుకుని రావాలంటూ ల‌క్ష్మిని వేధించేవారు. ఈ క్ర‌మంలోనే ఆమె గ‌ర్భం దాల్చింది.

ప్ర‌స్తుతం అయిదో నెల‌. సోమ‌వారం ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ల‌క్ష్మి మృత‌దేహం క‌నిపించింది. అత్తింటి వారే త‌మ కుమార్తెను హ‌త్య చేశార‌ని, దాన్ని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని ల‌క్ష్మి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ధార్వాడ రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here