జ‌నావాసాల మ‌ధ్య చిరుత మృత‌దేహం!

కార్వార‌: ఓ చిరుత అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా శిర‌సిలో చోటు చేసుకుంది. శిర‌సిలోని హుత్గార రోడ్డు ప‌క్క‌న చిరుత క‌ళేబ‌రాన్ని పోలీసులు, అట‌వీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చిరుత‌కు రెండేళ్లు ఉంటాయ‌ని అట‌వీశాఖ అధికారులు తెలిపారు.

శిర‌సి ప‌ట్ట‌ణం చుట్టు ప‌క్క‌ల నెల‌రోజుల వ్య‌వ‌ధిలో ఓ చిరుత క‌ళేబ‌రం దొర‌క‌డం ఇది మూడోసారి. రోడ్డు దాటుతున్న స‌మ‌యంలో కారు ఢీ కొని మ‌ర‌ణించి ఉంటుంద‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేసిన‌ప్ప‌టికీ.. అది త‌ప్పు అని తేలింది. దీనితో చిరుత‌ను వేటగాళ్లు హ‌త్య చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here