8 నెల‌ల కిందట ప్రేమ‌వివాహం..రెండు నెల‌ల గ‌ర్భం! అంత‌లోనే ఆత్మ‌హ‌త్య‌!

మండ్య‌: ఎనిమిది నెల‌ల కింద‌ట ప్రేమ వివాహం చేసుకున్న మ‌హిళ ఒక‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఆత్మ‌హ‌త్య చేసుకునే స‌మ‌యానికి ఆమె రెండు నెల‌ల గ‌ర్భిణి కూడా. మృతురాలి పేరు ప్రీతి. క‌ర్ణాట‌క‌లోని మండ్య జిల్లా పాండ‌వ‌పుర తాలూకా మేల్కొటేలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

ఎనిమిది నెల‌ల కింద‌ట ఆమె మేల్కొటేకు చెందిన మంజునాథ్ అనే ఆటో డ్రైవ‌ర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారిది ప్రేమ వివాహం. త‌ల్లిదండ్రుల‌ను ఎదిరించి, మంజునాథ్‌ను పెళ్లాడారు. ఒకే గ్రామానికి చెందిన వారైన‌ప్ప‌టికీ.. ఆ రెండు కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు లేవు. ఈ క్ర‌మంలో..గురువారం మ‌ధ్యాహ్నం ప్రీతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

త‌న కుమార్తెను హ‌త్య చేశార‌ని ప్రీతి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మేల్కొటే పోలీస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్రీతి త‌ల్లిదండ్రులు, బంధువులు మంజునాథ్‌పై దాడి చేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచార‌ణ కొన‌సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here