ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్.. ఆ తర్వాత జీవితంలో ఎన్నో మలుపులు.. మళ్ళీ ఇప్పుడు ఇలా..!

శ్వేత బసు ప్రసాద్.. కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెలుగు వాళ్ళకు పరిచయం అయింది. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో యువతను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రైడ్, కాస్కో లాంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని చెత్త సినిమాలు చేసి క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి. ఇక ఆమె జీవితంలో జరిగిన ఓ ఘటనకు టాలీవుడ్ కూడా షాక్ అయింది. ఆ తర్వాత హిందీ సీరియల్ తో బిజీ అయిపోయింది.

 

ఇప్పుడు మరోసారి శ్వేత బసు ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెజాన్ సంస్థ తమ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సైట్ కోసం నిర్మించిన గ్యాంగ్ స్టార్స్ వెబ్ సిరీస్ లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్ర పోషించింది. ఇందులో జగపతి బాబు, నవ దీప్ లు కూడా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ అన్నా శ్వేతబసుకు మరోసారి స్టార్ డమ్ తీసుకొస్తుందేమో చూడాలి. ఇక నటన పరంగా చిన్నప్పుడే నేషనల్ అవార్డు అందుకున్న శ్వేత.. ఈ టీవీ సిరీస్ లో ఉన్న స్టార్స్ ను ఎలా డామినేట్ చేస్తుందో వేచి చూడాలి. జూన్ 1 న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here