వాళ్లెక్క‌డి వాళ్లో..ఎక్క‌డికొచ్చారో..ఇక్క‌డేం చేస్తున్నారో తెలుసా?

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్నది కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు. స్విట్జ‌ర్లాండ్‌, అమెరికా దేశాల‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ‌, పురాత‌త్వ, జియోలాజిక‌ల్‌ శాస్త్ర‌వేత్తలు. మ‌న తెలంగాణ‌లోని కుమ‌రంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా అడ‌వులు వారిని ఇట్టే ఆక‌ర్షించాయి. జిల్లాలోని కెర‌మెరి అడ‌వుల్లో ఆ శాస్త్ర‌వేత్తలు అడుగు పెట్టారు.

తెలంగాణ ఊటిగా, ద‌క్షిణాది రాష్ట్రాల కాశ్మీరంగా గుర్తింపు పొందిన కెర‌మెరి అడవుల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. కార‌ణం.. కెర‌మెరి అడ‌వుల్లో గుట్ట‌లు ల‌క్ష్యంగా వారి ప‌రిశోధ‌న సాగుతోంది. కెర‌మెరి అడ‌వుల్లో గుట్టలు ఎలా ఏర్పడ్డాయనేది? ఎప్పుడు ఏర్పడ్డాయనే అంశాల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ట్టు చెప్పారు.

దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అమాయకపు ముఖాలతో కనిపించే అడవి తల్లి బిడ్డలు..కెర‌మెరి అడ‌వుల‌కు ప్ర‌త్యేక‌త‌ను తెచ్చి పెట్టాయి.

ఓ వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని పరవళ్ళెత్తే జలపాతాలు.. మరోవైపు కెరమెరి పర్వత పంక్తుల అందాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న కెర‌మెరి అడ‌వుల్లో ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి ప్రేరేపించింద‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here