న‌క్క తోక తొక్కితే అంతే! వారంలో రెండు లాట‌రీలు! మ‌న క‌రెన్సీలో దాని విలువెంతంటే!

మ‌న వ‌ద్ద లాట‌రీల‌ను నిషేధించారు గానీ.. కేర‌ళ స‌హా కొన్ని ఉత్త‌రాది రాష్ట్రాల్లో, ఇత‌ర దేశాల్లో వాటి వ్యాపారం భేషుగ్గా సాగుతోంది. జీవితంలో ఒక్క‌సారైన లాట‌రీ కొట్టాల‌ని అనుకోని కామ‌న్ మేన్ ఉండ‌డు. ఆ ఆస్ట్రేలియన్ న‌క్క తోక తొక్కాడేమో గానీ.. వారంలో రెండుసార్లు లాట‌రీ కొట్టాడు.

దాని విలువ మ‌న క‌రెన్సీలో సుమారు 12.50 కోట్ల రూపాయ‌లు. సిడ్నీకి చెందిన ఓ వ్యక్తికి ముందుగా 7,70,000 అమెరిక‌న్‌ డాలర్ల విలువైన లాటరీ త‌గిలింది. మ‌న దేశీయ కరెన్సీలో దీని విలువ సుమారు 5 కోట్ల 20 లక్షలు. ఈ షాక్ నుంచి బ‌య‌టికి రాక‌ముందే- ఇంకో ల‌క్‌. ఇంకో లాటరీ తలిగింది. 14,57,834 ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది.

అంటే మన కరెన్సీలో 7 కోట్ల 43 లక్షల రూపాయలు. ఇలా ఒక్క వారంలో సుమారు 12.50 కోట్ల రూపాయ‌ల‌ను కొట్టేశాడు. కోటీశ్వ‌రుడైపోయాడు. ఈ డ‌బ్బును తీసుకెళ్లి రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెడ‌తాడ‌ట‌. ఒకే వారంలో రెండు లాట‌రీలు కొట్టిన వ్య‌క్తిని మొద‌టి సారిగా చూస్తున్నామ‌ని సద‌రు లాట‌రీ నిర్వాహ‌కులు నోరెళ్ల‌బెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here