సైరాలో యజ్ఞం చేస్తూ కనిపించిన చిరంజీవి.. ఈసారి క్లారిటీగా ఫోటో విడుదల..!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ సినిమాకు సంబంధించిన ఫోటోలు ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు మరొకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలో చిరంజీవి, నయనతార పక్క.. పక్కనే కూర్చున్నారు. ఏదో హోమం జరుగుతుండగా ఇద్దరూ జంటగా కూర్చుని ఉన్న ఫోటో ఇది. వాళ్ళ వెనుకనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఇందులో ఆయన మెగాస్టార్ కు గురువుగా నటిస్తూ ఉన్నారు. ఈ ఫోటోను ఆయనే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పని చేయడం గౌరవంగా ఉందని అందులో పేర్కొన్నారు.

ఇక సినిమాలోని మిగతా తారాగణం వెనుకనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సైరా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని ఎంపిక చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here