షాజహాన్ ఎవరి పేరు మీద తాజ్ మహల్ ను రాయలేదన్న మొఘల్ వారసుడు..!

కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు సరికొత్త వాదనకు తెరతీసింది. అదేమిటంటే.. షాజహాన్ తాజ్ మహల్ ను తమ పేరు మీద రాసిచ్చాడు. అది ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డుకే చెందుతుంది అని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షాజహాన్ సంతకం చేసిన పత్రాలు ఏవైనా ఉంటే.. వాటిని తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజ్ మహల్ భారతదేశ సంపద అని ముస్లిం పెద్దలు చెప్పుకొచ్చారు.

ఈ అంశంపై మొఘల్‌ సామ్రాజ్య ఆఖరి చక్రవర్తి అయిన బహుదూర్‌ షా జఫర్‌ మునిమనవడు వైహెచ్‌ టూసీ స్పందించారు. ఆయనే మొఘలుల వారసుడు. తాజ్‌ మహల్‌ భారత్‌ సొత్తని, దానిపై ఎవరికీ వ్యక్తిగత హక్కు లేదని స్పష్టం చేశారు. తనకు తెలిసినంత వరకు షాజహాన్‌ తాజ్‌ మహల్‌ ను ఎవరి పేరిటా రాయలేదని అన్నారు. వక్ఫ్‌ కార్యాలయంలో కుర్చీలు, బల్లలు లేవు కానీ తాజ్‌మహల్ కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తాజ్ మాది అని పేర్కొంటున్న సున్నీ వక్ఫ్‌ బోర్డు భూకబ్జాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మొఘల్‌ వారసులమైన తాము తాజ్‌ మహల్‌ ను భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నామని ఆయన తెలిపారు. తాజ్‌ పేరుతో రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here