అభిమానుల కాళ్ల‌కు న‌మ‌స్క‌రించిన త‌మిళ హీరో సూర్య‌!

త‌మిళ టాప్ హీరో సూర్య త‌న అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. తాము దేవునిగా అభిమానించే హీరో త‌మ కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

మొద‌ట‌.. అభిమానులు సూర్య కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డంతో.. ఆ త‌రువాత ఆయ‌న కూడా అదే ప‌ని చేశారు. సూర్య న‌టించిన తాజా చిత్రం `థానాసెర్న్‌థాకొట్టాం..` సినిమా ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా చెన్నైలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ మూవీ తెలుగులో `గ్యాంగ్‌` పేరుతో శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. కీర్తి సురేశ్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా బుధవారం రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. సూర్య స్టేజ్‌పైకి రాగానే అభిమానులు ఒక్కసారిగా స్టేజ్‌పైకి వెళ్లి సూర్య కాళ్లకు నమస్కరించారు. సూర్య కూడా వెంటనే వారి కాళ్లకు నమస్కరించారు.

ఈ దృశ్యాన్ని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. సూర్య తన అభిమానుల కాళ్లకు నమస్కరించడం చూసి అక్కడి వారు షాకయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here