గేటు దూకుతోన్న ఈ టాప్ మాస్‌హీరో ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం!

బ్లూ ష‌ర్ట్, దానిమీద బ్లాక్ క‌ల‌ర్ ప్యాంట్ ట‌క్ చేసుకుని, కూలింగ్ గ్లాస్ పెట్టుకుని స్ట‌యిల్‌గా క‌నిపిస్తోన్న ఈ యువ‌కుడు ఓ టాప్ హీరో. అంత‌కుమించి మాస్ హీరో. పేరు సూర్య‌. తమిళంలో టాప్‌హీరో.

డ‌బ్బింగ్ మూవీల‌తో మ‌న‌కూ సుప‌రిచితుడే. మ‌రెందుకాయ‌న అలా గేటు దూకుతున్నాడు? దీనికో కార‌ణం ఉంది. అభిమానుల తాకిడి. అభిమానుల తాకిడిని త‌ట్టుకోలేక ఆయ‌న ఇలా గేటు దూకి బ‌య‌ట‌ప‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న మ‌న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో సినిమా థియేట‌ర్‌లో చోటు చేసుకుంది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం సూర్య‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌, ఇత‌ర చిత్రం యూనిట్‌తో క‌లిసి ఆయ‌న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌చ్చారు.

స్థానిక మేన‌కా థియేట‌ర్‌లో చిత్రం యూనిట్ విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. సూర్య ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్‌ వద్ద గుమిగూడారు.

వారందరినీ సూర్య పలకరించారు. అనంత‌రం.. థియేట‌ర్ గేట్ నుంచి బయటికి రావాల్సి ఉంది.

థియేట‌ర్ బ‌య‌ట వంద‌ల సంఖ్య‌లో అభిమానులు ఉండ‌టంతో లాభం లేద‌నుకుని వెనుక‌వైపు వెళ్లాడు. అక్క‌డున్న గేటుకు తాళం వేసి ఉంది. థియేట‌ర్ యాజ‌మాన్యం తాళం చెవి తీసుకుని వ‌చ్చేలోగా.. సూర్య గేటు దూకి బయటికి వచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here